ఉత్తరాన మెరుపులై దక్షత చూపుతూనే
వానజల్లులై వరమిస్తుంది జలం!
చల్లదనమే తల్లితనమై మట్టిపరిమళం!
ఏరువాక గుండెధైర్యంగా సాగుతూనే
ప్రయత్నం ఫలసిద్ధిగా జలదీవెనలు!
చెలికల్లో పారే జీవితం రైతన్న!
తలపాగానూ తడిపేసే కుంభవృష్ఠిగానే
జలం వాగుల్ల వంకల్ల గంగమ్మసిరి!
రేపటి మాగాణి రేయీపగలు పైరుపచ్చలు!
చిక్కుల్లో చింతదీర్చే నీటివసతితో
ముమ్మాటికీ సేద్యం జలదేవతభాగ్యం!
కాల్వన ఉరికే చేపపిల్ల రైతుబిడ్డ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి