ఆరోజు రామయ్య తాత గారు మనవలు టి.వి.కి అతుక్కుపోయి ఉండటం చూశారు. ఆయన అమెరికా నించి వచ్చి పదిహేను రోజులు ఐంది.కానీ ఓసందేహం ఆయన ను పట్టిపీడిస్తున్నది.తను హైదరాబాదు వచ్చాడా లేక ఆ ..మెరికలోనే ఉన్నాడా అని. తెల్లారిన దగ్గర నించి కొడుకు కోడలు మనవలు ఆంగ్లం దంచేస్తూ మధ్య మధ్యలో తెలుగు హిందీ ఇంగ్లీష్ కలగాపులగం చేసి మాట్లాడుతున్నారు. అమెరికాలో ఆరునెలలు కూతురు పిల్లలతో గడిపిన ఆయనకు ఇది మింగుడు పడటంలేదు. ఎనిమిది పదేళ్ల వారు చక్కగా అమ్మా నాన్న తాత అని పిలుస్తారు. తనదగ్గర శ్లోకాలు పద్యాలు రాగయుక్తంగా నేర్చుకుని అక్కడ అమెరికన్ బాలలకి నేర్పుతున్నారు. అమెరికాలో తోచక "అమ్మా!నేను అన్న దగ్గరకు వెళ్లి పోతా.నాతనువు అక్కడే నా మాతృభూమి పై పోవాలి. "అని కోవిడ్ తగ్గటంతో హైదరాబాద్ వచ్చారు.మనవడు హరి.కానీ వాడిని అంతా హాయ్!హనీ!అనిపిలవటం బాధ గా ఉంది. మనవరాలు జానకి ని జాకీ అని కోడలు పిలుస్తోంటే ఒంటినిండా కారంరాసుకున్నట్లు ఉంది. తనభార్య పేరు ని ఖూనీ చేస్తోంది. చిన్నప్పుడే ఆమె పోతే మళ్లీ పెళ్లి చేసుకోకుండా తన అక్క సాయం తో పెంచాడు.పిల్ల జెల్లాలేని వితంతు మేనత్త ఆలన పాలనలో పెరిగిన తన కొడుకు పిల్లలు ఇలా తెలుగు భాష ను ఖూనీ చేయటం తాత కి నచ్చటంలేదు.
ఆరోజు జానకి చేతతెలుగు పాఠం చదివిస్థున్నారు.8వక్లాసు ఆమె వాక్య ప్రయోగాలు ఇలా చెప్పి రాసింది."నేను తల ఢిల్లీ పోయాను""మాటలు హోటల్ దాటుతున్నాయి. చేడుచెప్పు. కురా చేడేవు "తలపట్టుకున్నాడు."తాతా!హెడ్ ఏకా?" 'కాదు. .నీభాష యాస డోకు!'అక్కడే ఉన్న కొడుకు అన్నాడు..'నాన్నా!నీవు మారాలి. తల్లడిల్లటం కోటలుదాటటం జానకి పదాల అర్థం. " సరే రేపు చెప్తాను. 'తాత గారు లేచారు.రేపు అన పదం వినగానే పిల్లలు ఇద్దరు ముసిముసినవ్వులు చిలకరించటం చూసి ఆశ్చర్య పోయారు. టి.వి.లో రేప్ మానభంగపదాలు వింటానికి అలవాటు పడిన చెవులు ఆపిల్లలవి. హతవిధీ అని అనుకున్నారు.
ఆరోజు తాత గారు అభిమానంఅనే పదంతో వచ్చే రెండు మాటలు చెప్పమన్నారు. దు..స్వ తోమొదలు అవుతాయి అనిసూచించారు. "గ్రాండ్ పా.."ఆపిల్లలపిలుపుకి చిరాకు గా "అలాపిలవకండి.గొంగళి పురుగులా ఉంది. "అనేప్పటికి "సీతాకోక చిలుక జీవితం లో నిదశ. దాన్ని తాకితే దురదపెట్టి వాచిపోతుంది మన వేలు.ములగచెట్టు కాండంకి అంటుకుపోతాయి.ఆకులు బాగా మెక్కుతూ గూడు కట్టి కొన్నాళ్ళకు సీతాకోక చిలుక లా మారుతాయి." బట్టర్ ఫ్లై అని అర్ధం చేసుకున్నారు. "ఇందులో మూడు పదాలు వివరించండి!"
తెల్లమొహాలేశారు. సీత..రామాయణం అదే సీతాయణం.రామునిభార్య.
కోక అంటే చీర.చిలుక అనే పక్షి. మన తెలుగు భాష గొప్ప తనం తెలుసుకోవాలి. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడలేని తెలుగు పిల్లలు వారికి తెలుగు నోటి తో అనిపిస్తు రాయించని పెద్దలపై తాత కి కోపం వస్తోంది. ఇంగ్లీష్ మాట్లాడితేనే గౌరవం ఇస్తారు..విదేశాల్లో వారే నయం అని ఆయన నిట్టూర్పు విడిచారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి