ఎవరింట్లో వాళ్ళే
ఎవరికి వాళ్ళే
అందరు ఉన్నట్టే
ఎవరికి ఎవరు
లేనట్టే ..
సంకల్పితమా?
అసంకల్పితమా?
శల్యన్త్రమా?
ప్రారబ్దమా?
ఎందుకు ఏమిటి
ఎలా?
ఉన్నదిఉన్నట్టు
అర్థంచేసుకోవడం
ఒ కళ .
నిజానికి
ఎన్ని తత్వాలసారం
ఈ సన్నివేశం
ఎన్ని తర్కాలు
తేల్చిన
పరమ సత్యం
వంటరితనమంటే..
ఓ యోగం
నీలోన నిన్ను చూసుకునే
మార్గం.
ఏ విశ్వాసమైనా
శ్వాస ఉన్నంతవరకే
ఏ సంతోషమైనా
స్పందన ఉన్నంతవరకే
బ్రతుకులో
తొలిదశ మలిదశ
చివరిదశ అన్న
తేడా లేదు
జీవనరాగంలో
ప్రతిస్వరం
సరిగమపదనిస
ఆరోహణ
అవరోహణ
అవగాహన
విశ్లేషణ
వడపోయడం
అలవరచుకుంటే
స్వచ్ఛత
స్పష్టత
జీవన చిత్రమే ..
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి