అడవికి రాజు ఓ సింహం. దానిని ఎద్దు ఏనుగు మంచి మిత్రులు. అవి స్నేహంగా ఉండటం మంత్రి నక్కకు గిట్టేది కాదు. ఎలాగైనా వాటిని విడగొట్టాలి అనుకుంది. అందుకై మంచి పధకం వేసింది. ఒకరోజు సింహం కోపంగా ఉన్న సమయంలో దాని వద్దకు వెళ్లి ఎద్దు, ఏనుగుపై పితుర్లు చెప్పింది. "మహారాజా! నీవు గుడ్డిగా నమ్మే మిత్రులే నీకు ద్రోహం తలపెడుతున్నారు. నిన్ను చంపి పులిని రాజుగా చేయాలని ఎద్దు, ఏనుగు పధకం వేస్తున్నాయి. జాగ్రత్త" అని హెచ్చరించింది.
సింహం నిజమే అని నమ్మింది. కోపంతో రగిలిపోయింది. అప్పుడే మరో మంత్రి ఒంటె, సింహం దగ్గరకు వచ్చింది. "రాజా! తొందర పడకండి. నక్క మాటలు నమ్మకండి. నిదానంగా ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి" అంది. ఆ మాటలు సింహం చెవికి ఎక్కలేదు. కోపంతో ఉన్న సింహం ఒంటె పై విరుచుకు పడింది. నా హితం కోరే నక్కనే అనుమానిస్తావా?" నీవు కూడా ఎద్దు, ఏనుగుతో చేతులు కలిపినట్టు ఉన్నవే" అంటూ ఒంటెను చంపింది. సమయానుకూలంగా పెద్దవారితో మాట్లాడాలని అక్కడున్న జంతువులన్నీ గ్రహించాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి