గాలివాటానికో
నీటి ప్రవాహానికో
పశు పక్ష్యాదుల పాదముల తాకిడికో
విసిరేయబడిన విత్తును నేను
పెరిగి పెద్దైనా
ఫలితాన్ని ఆశించని మీ సొత్తును నేను
ఆకలని నేనడగలేదు, కాని
మీ ఆకలికి ఆసరా అవుతున్నాను
దాహమని ఏనాడూ దేహీ అని చేయి చాచలేదు
చుక్క చుక్కగా నీరు, నేలను ముద్దాడి
నా గొంతు తడిపినప్పుడే
భూమాతకు నేను జీవితాంతం దాసోహమన్నాను
ఆశను శ్వాసగా చేసుకుని బ్రతుకుతున్నాను
అడ్డంగా నన్ను నరికినా
నిత్యం మీ ధ్యాసలోనే క్షణాలను గడుపుతున్నాను
నాలోని ప్రతి అణువణువూ
మీకోసంఅహర్నిశలు శ్వాసిస్తున్నాయి
నన్ను బ్రతకనీయండి
నాలుగుకాలాలైనా మిమ్మల్ని బ్రతికించుకుంటాను
°°°°°
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి