: ఆట వెలది --దత్తపది : కూడు గూడు తోడు నీడ: -ఎం. వి. ఉమాదేవి, నెల్లూరు

 అనాథలు 
(కూడు )లేని బ్రతుకు కుమిలిపో యెనునేడు 
(గూడు)కొరకు యడిగి  గుండె జారె 
పేద వారి కోర్కె పెనుభార మెట్లగు 
(నీడ )నిచ్చి వారి (తోడు)నిల్వు!
శీర్షిక -కొత్త జంట 
(నీడ )లాగ నిల్చి నీ(తోడు) కోరితి 
కాపురమ్ము నయ్యె  కలల తోట 
కలిసి తిన్న (కూడు) కమనీయ మగుగుర్తు 
(గూడు)చేరినట్టి గువ్వలోలె !
కామెంట్‌లు