నవజీవన విధానం:- సత్యవాణి

 నవజీవన విధానం
నాగరికత నేర్పిన
నవజీవన విధానం
నువ్వు నాకేమిస్తావు
నేనునీకెంతివ్వాలి 
నాగరికత నేర్పిన వ్యాపార సూత్రం
అంతా వ్యపారం
అన్నింటితో వ్యాపారం
అమ్మ ప్రేమతప్ప
అన్నీ కొనుగోలు వస్తువులే
అన్నీ అమ్మగలిగిన వస్తువులే
మానం అభిమానం 
ఆత్మగౌరవంతో సహా
అన్నీ అమ్ముకోగలిగిన వస్తువులే
అమ్ముకొన్నా అనుకొన్నది
చేజిక్కక వమ్ము కావడమే
అడుగడుగున దగా దగా
అదే గదా నేటి నవజీవన విధానం
ఏదీ ఎక్కడ ఎక్కడ నవజీవన వికాసం 
           
కామెంట్‌లు