ఖాకీ మనసు:- డా.. కందేపి రాణీప్రసాద్.
“మనిషికో మాట గొడ్డుకో దెబ్బ“ అన్నారు 
ఇదేక్కడన్నా జరుగుతుందా 
తిరగేసి రాసుకోవలేమో 
లాక్ డౌన్ ఎందుకుందో తెలుసు 
కరోనా ఏం చేస్తుందో తెలుసు 
దేశాలన్నీ వనకటం 
చూస్తూనే ఉన్నాం !
వేలల్లో ప్రాణాలు పోవటం 
చూస్తూనే ఉన్నాం !
ఐనా బయటకు రావద్దంటే 
అర్దం కాదు !  

చేతులెత్తి మొక్కినా 
కరోనా వేషంలో చెప్పినా 
ఏడ్చి మొత్తుకున్నా 
వినరాయే !
“దండం దశగుణ బావేత్” అని 
లాటి తీస్తే తప్ప 
దారిలోకి రారు 
ఇక టివిల్లో రోజంతా అదే చూపిస్తారు 
కొడుకు ముందే కొట్టరంటు 


ఇంట్లో ఇద్దరు పిల్లలు
 అల్లరి బరించలేక   
విపు విమానం మోత మోగిస్తారు 
పోలీసులు మాత్రం 
ప్రశాంత వదనంతో వేలమందిని 
కంట్రొల్ చేయాలి ! 
కామెంట్‌లు