*అక్షర మాల గేయాలు*-*'ణ' అక్షర గేయం*

 కరణం గారు కూతురు పెళ్లికి
కంఠాభరణం చేయించారు
గణగణ మువ్వల పాడి ఆవును
అరణంగా అల్లుడికి ఇచ్చారు
అణకువగా అనురాగంతో
ఆలూమగలు అనుక్షణం
ఆనందంగా ఉండాలంటూ
దీవెనలు ఎన్నో ఇచ్చారు

కామెంట్‌లు