*కుందేలు - తాబేలు* (కథ)("రాజశ్రీ" సాహిత్య ప్రక్రియలో)(మూడవభాగం):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 9)
దెప్పిన తాబేలును జూసింది
కుందేలు ఒడలు అదిరింది
కుందేలు మీసాలు నిక్కించే
కుందేలు చెవులు రిక్కించే!
10)
కుందేలు కన్నులు కెంపులయినాయి
కుందేలు వెంట్రుకలు పైకిలేచినాయి
కుందేలు కోపముతో ఇలాఅన్నది
తాబేలు శాంతముతో అదివిన్నది!
11)
పనిలోన పసలేని ప్రతియొకడు
ఎంతో వినయము నటించుతాడు
పనితనము లేని ప్రతివారు
పనిలోని దిట్టను అపహసిస్తారు!
12)
ప్రతిభ గర్వము ఈరెండు
అక్కచెల్లెళ్ళని అంటారు లెండు
ప్రతిభ కలవారిని లోకులు
గర్విష్టి అంటారు కాకులు!
(ఇంకావుంది)

కామెంట్‌లు