రెండు ' శ్రీ ' ల శ్రీమంతుడు.....శ్రీ శ్రీ. :- --డా.కె .ఎల్వీ హనంకొండ .

అయన కవిత్వం లొ 
విప్లవ రేఖలు ఉన్నై !

అయన కవిత్వం లొ 
ప్రేమలేఖలూ ఉన్నై !

పదాల విలువ 
అయన కలం నుంచి రాలి 
పదింత లవుతుంది !

విప్లవ కారుడిలోను 
గొప్ప ప్రేమికుడుంటాడని 
నిరూపించిన వాడు 
మన మహా కవి !

రెండు 'శ్రీ 'లను 
తలకెత్తు కున్న .....మనందరి
 శ్రీ .శ్రీ .
ఆయనకిదే నా కుసుమాంజలి !!


కామెంట్‌లు