అపార్థం.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 హాస్టల్ ముందు నించొని ఆ పిల్ల ఏడుస్తున్నది అతను ఓదారుస్తున్న డు.
ఆగని కన్నీళ్లను కర్చీఫ్ తో తుడిచాడు. అరగంట వరకు ఆ ఇద్దరూ మాట్లాడుకున్నారు. కాసేపటికి ఆ పిల్ల మామూలు మనిషి అయింది. అతను అను జేబులో నుంచి డబ్బు తీసి ఆమె చేతిలో పెట్టాడు. తీసుకోలేదు వద్దన్నది. బలవంతంగా చేతిలో పెట్టాడు. మొహమాట పడకు నేనున్నానని గుర్తుంచుకో అవసరం వస్తే ఫోన్ చెయ్ అంటూ ధైర్యం చెప్పాడు. తప్పనిసరిగా తీసుకుంది . చేతి సంచి లో ఉన్న పండ్లు కూడా ఇచ్చేశాడు. అప్పటికి ఆ పిల్ల ముఖంలో శాంతం కనిపించింది. ఆనందు ఇంటికి రాగానే చెప్పులు విడిచి లోపలికి వెళ్ళాడు. భార్య ఎంతకీ కాఫీ ఇవ్వలేదు టీవీ ముందు కూర్చున్నాడు. అరగంట తర్వాత ఆటో దిగి వచ్చింది భార్య సుప్రియ. ఎక్కడికి వెళ్లావు భర్త వస్తాడని సమయానికి కాఫీ ఇవ్వాలని లేదా షికార్లు పెత్తనాలు మొదలు పెట్టావా అన్నాడు కాస్త కోపంగా. సుప్రియ మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది ఆనంద్ కి ఒళ్ళు మండిపోయింది. ఎక్కడికి వెళ్లావు అంటే చెప్పవే ఏమిటి నిన్నే అడిగేది అన్నాడు. అన్ని మీరు నాకు చెప్పే వెళ్తున్నారా అన్నది కాస్తంత కోపంగానే.నేనేం చేశాను అన్నాడు. మీరు ఈ మధ్య ఏంటి విషయాలు పట్టించుకోవడం లేదు. ఏది అడిగినా రుసరుసలాడుతూ ఉన్నారు పండక్కి చీర పొలం అంటే డబ్బు లేదన్నారు బయటవాళ్ళకి ఇవ్వడానికి ఎలా వచ్చాయి. మీకు ఇంటి విషయాల కన్నా బయట రాజకీయాలు ఎక్కువైనాయి అంటూ దెప్పి పొడిచింది. ఏమిటో చెప్పమని అమాయకంగా ప్రశ్నించాడు. ఇంకా అర్థం కాలేదా అంత అమాయకులు మీరు. అప్పటి నుంచి సాగుతున్నది నాటకం ఎన్నాళ్ళని దాచి పెడతారు నాకు తెలియదు అనుకుంటున్నారా చెప్పండి ఆ అమ్మాయి ఎవరు అంటూ నిలదీసింది. అమ్మాయా ఎవరా అమ్మాయి అన్నాడు. ఏమీ తెలియనట్టు మాట్లాడకండి సాయంత్రం మీరు హాస్పిటల్ పక్కన నిలబడి ఒక అమ్మాయి తో మాట్లాడుతున్నారు జేబులో నుంచి డబ్బులు కూడా తీసి ఇచ్చారు నాకు తెలియదు అనుకుంటున్నారా అన్నది. ఇదంతా నీకు ఎవరు చెప్పారు అన్నాడు ఆనంద్. తెలియకుండా ఎన్నాళ్ళు సాగిస్తారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు. నువ్వే మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నువ్వు అనుకున్నట్లు ఆ పిల్ల ఎవరనుకున్నావు. నిజం తెలుసుకోకుండా అపార్ధాలు చేసుకొని అబాండాలు మోపి తున్నావు. అదంతా నాకు తెలియదు ఇంతకీ ఆ పిల్ల ఎవరో చెప్పారు కాదు. మా పెద్దమ్మ కూతురు శైలజ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఎవరో ఆకతాయి వెధవ రోజు ఫోన్లు చేసి నిన్ను ప్రేమిస్తున్నానని ని ఏడిపిస్తున్నాడట. నేనిక్కడ ఉండను వెళ్ళిపోతాను అంటున్నది. వాడి నెంబరు తీసుకొని నాలుగు చివాట్లు పెట్టి వదిలేశాను ఈసారి ఫోన్ చేస్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఇంకెప్పుడూ చేయని ప్రాధేయపడ్డాడు. కాలేజీ ఫీజు కట్టాలంటే నేనే డబ్బులు ఇచ్చాను పాపం పెద్దమ్మ వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రం. అప్పుడప్పుడు అని పెట్టి ఇ చూస్తున్నామన్నారు ఆ పిల్లను చదివిస్తే ఉద్యోగం చేస్తూ ఇంటికి సాయపడుతుంది ఇప్పుడు చెప్పు నేను చేసింది తప్పే అంటావా అన్నాడు ఆనంద్. నన్ను క్షమించండి నేనే అపార్థం చేసుకున్నాను. రేపు ఆదివారం ఆ అమ్మాయిని మన ఇంటికి భోజనానికి రమ్మని పిలవ మన్నది. మీ ఆడవాళ్ళకి ముందు అనుమానం ఎక్కువ తర్వాత అపార్థం చేసుకోవడం అలవాటేగా ఇప్పటికైనా చీకటి తొలగి పోయింది అన్నాడు ఆనంద్. సుప్రియ పశ్చాత్తాప పడింది.
కామెంట్‌లు