మనం మనమే! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం ఎప్పుడూ ఒకరితో పోల్చుకుని ఆత్మన్యూన్యతాభావంతో ఉంటే  ముందడుగు వేయలేము.పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు మనం అశాంతితో అభాసుపాలవుతాము.కొంత మంది పిల్లలు ఇంట్లో చక్కగా బాగా చలాకీగా మాట్లాడుతారు. కానీ బడిలో బిగదీసుకుపోతారు. నేను తెల్లగా లేను ఆమెకి నాకన్నా ఎక్కువ మార్కులు వస్తున్నాయి అని కుంగిపోతారు.మనరెండవప్రధాని లాల్బహద్దూర్ శాస్త్రీజీ పొట్టి.నెహ్రూ అంత గ్లామర్ లేదు. కానీ 18నెలల ఆయన పాలన జైజవాన్ జైకిసాన్  నినాదం మన గుండెలో మారుమోగుతూనే ఉంది. అప్పుటి పాక్ ప్రెసిడెంటు  ఆయూబ్ఖాన్ ముందు ఈయన వామనుడిలా కనపడ్డాడు. ఒక విలేఖరి ఈవిషయాన్ని ప్రస్తావిస్తే ఆయన ఏమన్నారో తెలుసా?"నేను భారతదేశం లా ఠీవి గా తలెత్తి నిలబడ్డాను.నాతో ఎవరు మాట్లాడాలనుకున్నా తలదించుకోవాల్సిందే!"అంతే...నవ్వులపువ్వులు విరిశాయి. అదీ మనం మనలా ఉండటం అంటే! ఒక అతనికి నత్తి. సరిగ్గా మాట్లాడలేనేమో అనే జంకుతో నోరెత్తడు. ఒక ఫ్రెండ్  సలహా ఇచ్చాడు"అద్దం ముందు  నిన్ను నీవు చూస్తూ  మాట్లాడటం అభ్యాసం చెయ్యి.సంకోచం లేకుండా చేయగలను సాధించగలను అని పట్టుదల  పాజిటివ్ గా ఆలోచించడం మంచిది. "ఇక స్కూల్లో కూడా ఎవరైనా  తప్పు గా చదివితే వెంటనే  హేళనగా నవ్వితే ఆపిల్ల  ఇక హీనభావంతో  డల్ గా తయారవుతుంది. టీచర్  ఇంట్లో  పెద్దలు  ఒకటికి రెండు  సార్లు  అనిపించాలి.స్పష్టంగా మాట్లాడే పిల్లలతోవారిని  జతకలిపి అభ్యాసం చేయించాలి.  ఈరోజుల్లో  ఆడవారు అంతా గ్రూప్ గాఆన్ లైన్లో పారాయణం గా దైవపారాయణ చేస్తున్నారు. ఒకరు చెప్పితే  మిగతావారు  రిపీట్ చేస్తారు. అలాగే ఇంటి లో  పెద్దలు  పాఠంని పాట లాగా పాడిస్తే  పిల్లలు ఉత్సాహంగా నేర్చుకుంటారు.  బడిలో పాట ని పాటగానే నేర్పాలి. మనపై మనకు నమ్మకం కలగాలంటే అద్దం ముందు నిలబడటం మానేయాలి .భౌతిక అందం కన్నా మనమాట మంచితనం ప్రవర్తన అందరికీ మనపై మంచి అభిప్రాయం  కలిగిస్తాయి. అందమైన గులాబీతో పాటు గడ్డి పూవు కూడా అందమైనదే!
పెద్దచెట్టు తుఫానుకి  కుప్పకూలుతుంది. కానీ గడ్డి పరక లేచి నిలబడుతుంది.  ఇదే ఆత్మ విశ్వాసం. మనం మనంగా ఉంటే మనం భవిష్యత్తు లో కీర్తి శిఖరం అధిరోహించవచ్చు.
కామెంట్‌లు