పండుగలు సంస్కృతి సారథులు(ఇష్టపది)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

ఇంటి ముందు ముగ్గులు ఇంటిలో దీపాలు
గుమ్మపు తోరణాలు గుడముతో పాయసం

గడపకు పసుపుతోన గంధం బొట్టుతోన
తలంటు స్నానాలు తాళింపు ఘుమఘుమలు

బంధుమిత్రుల‌ రాకలు‌ బాలలకు సరదాలు
పిండివంటల రుచులు పీడల తొలగింపులు

పూజలతోన కొలిచి పూర్ణాలతోన తిని
పెద్దల తర్పణాలు పేదలకు దానాలు
కామెంట్‌లు