"*తొలిపొద్దు*ఆదర్శ బాలల కవితలు" ఆవిష్కరణ


 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ ప్రాంత బాలబాలికలు చాలా ప్రతిభా వంతులు.వారికి అనువైన చదువుకునే వాతావరణం,ప్రోత్సహించే వారు లేకపోవడం వలన మట్టిలో మణిక్యాల వలె మరుగున పడిపోతున్నారు.ఒక చిరు ప్రయత్నంగా మా పాఠశాల విద్యార్థులు వారి భావాలను అక్షరీకరించిన కవితలను "*తొలిపొద్దు*ఆదర్శ బాలల కవితలు"అనే పేర పుస్తక రూపం ఇవ్వడం జరిగింది.మా చిన్నారులు ఉత్సాహంగా కవితలు రాసారు.వారిని ఆశీర్వదించండి.ఈ ప్రయత్నానికి ప్రోత్సాహాన్ని,ఆర్థిక,హార్థిక తోడ్పాటుని అందించిన మా పాఠశాల ప్రధానాచార్యులు మరియు ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతాభివందనములు. ఆశీస్సులు అందించిన మన జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ ఎస్.యాదయ్య గారికి వినమ్ర నమస్సులు.
కామెంట్‌లు