జగ మెరిగిన సత్యం:-తొగర్ల సురేష్ , వర్ని , నిజామాబాదు జిల్లా
*భయం లేదు మనకు ధీరుడా
కరోనాకు జడుసు కోకు శూరుడా
క్రమ శిక్షణ యే అయుధంబు రా
కలిసి చేస్తే కను మరుగౌను రా
 "భయం"
*నీ ఇల్లే నీకు స్వర్గసీమ రా
 గడప లోపలుంటే కరోనా నీ దరి రాదురా
పోకిరిలా తిరుగ బోకు వీరుడా
నీ ఫోటోకు దండ నేయ నీకురా
విజ్ఞానం పెంచుకో యోధుడా
వికాసం వికసింప జేయరా 
అజ్ఞానం విడ నాడు మిత్రమా
ప్రగతి బాటలో నీవు నడవ రా
*జల్సాలు మానీ యుండు  సోదరా  
మాన వాలికి మేలు చేయు సోదరా
మన జాతి గౌరవం పెంచి చూపరా
మన విజ్ఞతను మహికి నీవు చాటరా
పెద్దల మాటల నెప్పుడు వినాలిరా
అపుడే మనం బాగు పడ్తామురా
వినక పోతే ఓ సోదరా
కను మరుగై పోతామన్నది కనరా
ఇది జగ మెరిగిన సత్యం సో దరా 
ఇదే మనకు బంగారు బాట తమ్ముడా..
_________________________
__Thogarla Suresh.ASI PS Varni.Dist.Nizamabad



కామెంట్‌లు