పైట పావడ జాకెట్టు
యవ్వనానికి తొలిమెట్టు
గాజులు గలగల లాడేట్టు
నవ్వుతు చేసే కనికట్టు !
సంస్కృతి చాటే తెలుగమ్మాయి
భారతీయత వెలుగమ్మాయి
బొట్టూ కాటుక పెట్టుకొని
నట్టింట్లోని మహాలక్ష్మి కదోయి !
ఆటపాటల్లో మేటిగా ఉండు
అభిప్రాయం సూటిగా ఉండు
మనసు స్వచ్ఛమే మల్లె చెండు
తేటతెలుగులో మాటలుండు!
రంగవల్లులు,కోలాటాలు
కూచిపూడి,కరాటే బెల్ట్
కృష్ణ శాస్త్రి, సినారెల గీతం
పాకశాస్త్రం తెలుగమ్మాయి సొంతం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి