కనిపించే దేవుడు నాన్న:--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.

కనిపించే దైవము
కన్నతండ్రి మహిలో
కరుణకు ప్రతిరూపము
కొలువాలోయ్ మదిలో

వెలుగునొసగు దీపము
వెన్న వంటి హృదయము
ఎన్నడు కొలువలేము
కన్నతండ్రి త్యాగము

నష్టాలు వచ్చినా..
ఇష్టాలు చంపుకొని
కష్టాలు మోస్తాడు
శ్రేష్ఠము కన్నతండ్రి

త్యాగమంటే నాన్న
ప్రేమంటే నాన్న
సృష్టిలోనే మిన్న
సకల సంపదల కన్న

కామెంట్‌లు