సమభావ సమున్నతం,చిత్తశుద్ధి(తేటగీతి పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్

         సమభావ సమున్నతం:
అన్ని విషయాల యందును అణగి యున్న
యోగ మతనికి సొమ్ముగా యోగ్య మగును
మదిని యంటని విషయాల మహిమ‌ వలన
రాగ ద్వేషాలు మనసుకు రాని
మనిషి
               :చిత్తశుద్ధి:
మార్గ మదియే కాదగు మాన వునకు
స్వర్గ ద్వారము తెరుచును సాధు గుణము
సర్వ ప్రాణుల దయతోడ సంయమనము
చేయ వలయును దానము చేతి నిండ
కామెంట్‌లు