వరదల్లొ బురదల్లో
వాగుల్ల వంకల్ల మేము
సైయాటలాడేము.
వాడ వాడల్లోన
ఆయిల్లు ఈయిల్లు
పట్టుకొని వచ్చి పారే
నీటి బుడగల్తొ గలగలలాడుచు.
ఏరులా పొంగుతూ వచ్చే
నీటి తరగల్లె నురుగుల్లొ
ఊరు ఊరంతా సంబరపడ
కన్నుల్లో నీరె నీటిలో దుంక
గలగల మంటు పారుతు వచ్చే.
వాన నీటి పాయల్లో
మేము పోటే బడుచు
రంగు రంగుల పడవలేసేము
వొంపుల సొంపుల దిరుగుచు
కాఫి రంగు వంటి నీటిలోన
గలగల లాడుచూ
అలల వెంట నీటిలోన
పరుగులెత్తీ పోయేము.
వానకాలం మట్టివాసన్లో
చెరువుగట్లు దాటు వానలే
నింగి మబ్బులే ముద్దాడంగ
నిండుకుండలై మెరిసేను.
మా వూరి చెరువే బంగారు
చెరువే
పచ్చ పచ్చ తామురాకుల్లో
నీటి ముత్యాల ముద్దుగ
మెరిసేను.
నిండు కొలనులో తామరాకులే
సాయసిందూర కాంతులవోలె
నిగ నిగలాడుచు పదారేల పిల్లలా
వీచే చల్లని గాలులకే వయ్యారంగా ఊగేను
కొంగల్ల గుంపుల్ల బుడుగూల పిట్టల్ల.
నీరెండ వానల్లో కాకుల్ల అరుపుల్ల
చెంగు చెంగున చేపపిల్లలే
ఎగిరెగిరి గంతేసి ఆడేటి
మావూరి నిండు చెరువుల్లో
ఈతలె గొట్టి పల్టీలేసేము
కాలమే మరచీ నీటాటలాడేము
బడుగు పిట్టల్ల వోలే బుడుక్కున మునిగి
సైయాటలాడేము నీటిచెరువులో
మాలగడ్డలు దాటేము.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి