డా.సి.నారాయణరెడ్డి,దేవత(పద్యాలు-తేటగీతి)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 1.కవన రంగము నందును కాంతి నింపి
పాట పరిమళ వ్యాప్తికి పాటు పడెను
సభల రంజింప జేసెను సవ్య సాచి
జ్ఞాన పీఠము నెక్కిన ‌జ్ఞాని‌ యతడు

 దేవత(గోమాత)

2.తల్లి లాగున‌ పాలను తనివి తీర
ఇచ్చు గోమాత దేవత నిలను‌ గొల్వ
తాను పూజకు అర్హమై తావి యగును
దేవు లెల్లరు నిండిన దేవ ముఖము
కామెంట్‌లు