ఆనందమైన జ్ఞాపకం ;- జగదీశ్ యామిజాల

 తమవారని అనుకున్న వారి నుంచి 
అందుకున్న ఉత్తరాలు 
ఇచ్చినంత ఆనందం 
మరెక్కడా పొందలేమనే 
నాటి తరం మాట
నా మాటా అదే....
అన్నట్టు 
పన్నెండు నెలలు ఓ ఏడాది
అనే లెక్కన
లెక్కించుకుంటూ
చూస్తే 
నాకిది అరవై ఏడో సంవత్సరమే
కాదనలేని నిజం
కానీ
ఆరోజుల్లో
పోస్ట్ మ్యాన్ నుంచి అందుకున్న ఉత్తరాలు చదువుతున్నప్పుడూ
వాటికి జవాబులు రాసి
పోస్ట్ డబ్బాలో వేస్తున్నప్పుడూ
పొందిన ఆనందం
చిరస్మరణీయం
ఈ కాలపు 
సామాజిక మాధ్యమాలెన్నో ఉన్నా
వాటితో కలిగే పరిచయాలెన్ని
మనసు విప్పి మాట్లాడుకునేవో
తెలీదు
ఎవరి మాటలకు చక్కెర అద్దుతున్నారో
ఎవరి ముఖాలకు 
పరదాలు తొడుక్కున్నారో
ఏది మంచో
ఏది చెడో 
తెలియని అయోమయస్థితి...
ఇవన్నీ చూస్తుంటే
నాటి పోస్టు డబ్బాలూ
ఉత్తరాలు అందుకోవడమే
ఆనందమైన జ్ఞాపకాలుగా 
మిగిలాయి ఇప్పటికీ ఎప్పటీకీ

కామెంట్‌లు