ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు బలే విచిత్రమైనవాడు. ప్రతి దానికీ కీడు శంకిస్తూ ఆలోచించేవాడు. ఏదో కీడు జరగబోతుంది అని ముందే ఊహించి ఆందోళన చెందేవాడు. అలాంటి ఆవ్యక్తి ఓ రోజు నది దాటు తున్నాడు. పడవ నీటిపై నిశ్చంతగా వెళుతుంది. నది మధ్యలోకి వచ్చింది. ఆ సమయంలో ఆ వ్యక్తికి ఓ వింత ఊహ వచ్చింది. "పడవకు చిల్లుపడి నీరు లోపలికి వచ్చి మునిగిపోతే" వళ్ళంతా చెమటలు పట్టాయి. గొంతు తడారిపోయింది. వూపిరి బిగబట్టి కూర్చున్నాడు. పడవ ఒడ్డు చేరే వరకు అతడు బిగుసుకుపోయి కూర్చున్నాడు. ఒడ్డుకు చేరాక అమ్మయ్యా అంటు వూపిరి పీల్చుకున్నాడు. ఆ తరువాత అనుకున్నాడు. అసలు నేనెందుకు భయపడ్డాను? ఈతరాకపోబట్టేకదా? అనుకున్నదే తడువు వెంటనే ఈత నేర్చుకోవడం మొదలు పెట్టాడు. మనకొచ్చే సమస్యలు మనం చేతులారా తెచ్చుకునేవే ఎక్కువ ఉంటాయి. ముందుగానే ఏదో జరుగుతుందని ఊహించడం వల్లనే సమస్య ఉత్పన్నమవుతుంది. వాస్తవంగా ఆలోచిస్తే మనం అనుకొనేవి ఏవి జరగవు. జరిగేవాటిని ఎవరు ఆపలేరు. అలాంటప్పుడు ఆందోళన పడవలసి అవసరం లేదని ఈ కథ ద్వారా తెలుస్తుంది.
ఈత రాక పోబట్టే? (బుజ్జిపిల్లలకు బుజ్జికథ)౼ దార్ల బుజ్జిబాబు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి