చినుకుల సందడి:---గద్వాల సోమన్న
చిటపట చినుకులు కురిసెను
అందరి గుండెలు మురిసెను
రైతుల ఆశలు మొలసెను
మోమున మోదము విరిసెను

పొలములు బాగా తడిచెను
సాగుకు వీలుగ మారెను
హలములు భుజమున పెట్టిరి
రైతులు చక్కగ దున్నిరి

జలజల జలములు పారెను
వాగులు,చెరువులు నిండెను
పిల్లలు పడవలు చేసిరి
నీటిపై వదిలి ఆడిరి

తరువులు స్నానం చేసెను
అందరి దాహము తీర్చెను
ప్రకృతికి ఊపిరి పోసెను
జగతికి అండగ నిలిచెను


కామెంట్‌లు