అందరికీ తెలివితేటలు ఆలోచన శక్తి ఉంటాయి. కొందరు త్వరగా స్పందిస్తారు.చురుగ్గా పనిసాధిస్తారు.యుక్తి సమయస్ఫూర్తి ఉన్న వారికి చదువు తో పనిలేదు. దానికి తోడు చదువు చాకచక్యం ఉంటే ఇంకా రాణించి దూసుకుపోతారు.
అంగరాజు కళాపోషకుడు.ప్రతిఏడూ వసంతోత్సవాలు ఏర్పాటు చేసి వివిధ రాజ్యాల నించి వచ్చి తమప్రతిభ చూపేవారిని సత్కరించేవాడు. అన్నిరాజ్యాలుకూడా ఆయనను గౌరవించేవి.కళింగ రాజ్యంకి చెందిన చతురుడు అనే కళాకారుడు కూడా వచ్చాడు. తనుచేసిన మూడు బొమ్మలు తెచ్చాడు.అమ్మా నాన్న పాప బొమ్మలని పనికిరాని వస్తువు లు అంటే ఇనుప తీగలు బట్టముక్కలు కాగితపుగుజ్జు తో చేసి ఆకు పూల పసర్ల రంగులు వేశాడు. అతని నౌకరు గాజుపేటికను కూడా తెచ్చాడు.చతురుడు ఇలా అన్నాడు"ప్రభూ! ఈపేటికలోకి ఈబొమ్మల కుటుంబంని తరలించాలి." అంతా తెల్ల మొహాలు వేశారు. గాజుపేటిక మొత్తం చీమదూరేంత సందులేకుండా మూసిఉంది."చతురా!నీవే నీ చాతుర్యం చూపు"రాజాజ్ఞతో సరే అన్నాడు. నౌకరు ఒక దివిటీని వెలిగించాడు. చతురుడు ఆ బొమ్మలను పేటిక ముందు నిలబెట్టాడు. నౌకరు వెనక దివిటీ పట్టుకుని నించున్నాడు.అంటే దివిటీ పేటిక మధ్యలో బొమ్మలు ఉన్నాయి. వాటి నీడ పేటిక లో పడి అవి అందులో ఉన్న భ్రమను కలిగించింది. అంతా భేష్ భేష్ అని చప్పట్లతో అభినందించారు. రాజు బహుమానంతో సత్కరించాడని వేరే చెప్పనవసరం లేదు కదూ?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి