సున్నితం :-తొలకరి చినుకు :--ఖలీమ్ పాషా--మడికొండ, ఖాజీపేట, వరంగల్ అర్బన్
తొలకరి పలకరించిన వేళ
వేడినేలని ముద్దాడిన వేళ
పసరికతో చిగురుపచ్చని నేల
చూడచక్కని తెలుగు సున్నితంబు

పొంగిపోర్లనే ప్రకృతి జలాలు
పట్టుకొననే రైతులు  హాలాలు
దున్నెనే కర్షకులంతా  పొలాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

కాలచక్రం కనువిందు చేసినరోజు 
ఋతురాగం పలికిన తొలిరోజు 
తొలకరి ఒలికిన చల్లనిరోజు 
చూడచక్కని తెలుగు సున్నితంబు

జల్లులవాన ఎదఝల్లున మోగేనే
మట్టి పరిమళాలు తనువుకుతాకేనే
తనువుతాకి తన్మయత్వం చెందేనే
చూడచక్కని తెలుగు సున్నితంబు

కొత్తచిగురు పువ్వులు సింగారం 
పులకించిన పృథ్వి బంగారం
కమనీయ రమణీయ మందారం
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు