గణపతి (బాల గేయం):-పెందోట వెంకటేశ్వర్లు
జయ జయ గణపతి
చదువుల నడిగితి
గురువుల కరుణను
నడగగ నిలిచితి

తెలుగును పదములు
తెలియగ పలికితి
వెలుగుల విలువలు
కనుచునె నిలిచితి 

గణితము యనగనె
గుణ గుణ నడిచితి 
అలువక తెలిసితి
 వరముల విజయము

కనులను కదుపుతు
అడుగులు పడినవి
 హితులను కలువగ 
గలగల నుడివితి


కామెంట్‌లు