శంఖు పుష్పం -బాల గేయం :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
శంఖు పువ్వు చూడు 
చక్కగాను నేడు 
అందమే ఒలికింది 
మయూరమే చూడు !

నీలి రంగు అందం 
నిటారుగా చందం 
తీగపాకు తుందోయ్ 
తిన్ననైన  బంధం !

శివపూజకు ఘనము 
శివాయ నమః అనుము 
సున్నితమగు స్పర్శలు 
సుందరమగు శంఖుపూలు!

కార్తీక మాసము 
కనుల పండుగ రూపము 
చిక్కుడు కాయలల్లే 
గింజలుండు నాటుము!!


కామెంట్‌లు