(1)
కుందేలు ఒకటి గర్వి
తాబేలు ఒకటి నిగర్వి
పందెం వేసింది కుందేలు
సై అంది తాబేలు!
2)
గాలివలె కాంతివలె నేవెళతాను
కాలివేగాన లోకాలు త్రుటిలోను
నీటివలె నేను జారిపోతా
నువ్వేం చేస్తావో నేనుచూస్తా!
3)
నీ వలన ఏమవుతుంది
నీవు నీకే బరువవుతుంది
డొప్ప నీ గొప్ప
నాకాలి పిక్క నాగొప్ప!
4)
ఆ కుందేలు నవ్వింది
ఇంకా ఇలా అంది
నా రంగు పాలనురుగు
ఎంచక్కని మేని సొబగు!
(ఇంకావుంది)
కుందేలు - తాబేలు*(కథ)("రాజశ్రీ" సాహిత్య ప్రక్రియలో):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి