తులసి- సమ్మోహనాలు ( ముక్త పదగ్రస్తము):---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

కోటలో తులసమ్మ 
తులలేని సిరులమ్మ 
సిరులిచ్చి దీవించు కొలువగా ఓ ఉమా !

పెరటిలో కళకళగ
కళల సౌభాగ్యముగ
సౌభాగ్యవతులుగా ఆశీస్సు ఓ ఉమా !

పావనికి నీటినే 
నీటితోడ హృదినే 
హృదయ పూర్వకముగా అర్పించు ఓ ఉమా !

పసుపు కుంకుమ కోట
కోటలో కొలువులట
కొలువుదీరునమ్మా తులసమ్మ ఓ ఉమా !

పూల తో కొలిచేము 
కొలిచీ నైవేద్యము 
నైవేద్యమును పంచి మురిసేము ఓ ఉమా!

క్షీరాబ్ది ద్వాదశికి 
ద్వాదశిన ఆ హరికి 
హరితోడ పూజలే జరిపించు ఓ ఉమా!

తులసి కళ్యాణమది 
కళ్యాణ కరముయది 
కరములే జోడించి ప్రదక్షిణ ఓ ఉమా!

జలంధర వీరతకు 
వీరత్వ పదిలముకు 
పదిలపరచే  తులసి పావనియె ఓ ఉమా !

కోటలో మహరాణి 
మహాత్మగ యలివేణి 
అలివేణులందరికి అమ్మయే ఓ ఉమా !

ఎర్రమట్టిని అలికి 
అలికి రంగు ముగ్గుకి 
ముగ్గుతో అలంకరణ చేసిరి ఓ ఉమా!

ఔషధపు మొక్కలుగ
మొక్కగాలి సోకగ
సోకినను వ్యాధులే వీడునే ఓ ఉమా !


కామెంట్‌లు