జలసిరులు:-నెల్లుట్ల సునీత-కలం పేరు శ్రీరామ
జలసిరులే పుడమికి
 కళ సిరులు!
తరువులు తడిసిన పులకించిన ఝరులు!
కరువున వెలిసిన 
అమృతపు భాండ ము నిధులు!

పుడమితల్లి తనువును
 తాకి పులకించిన విరులు!
విశ్వ ధారగా మానవాళికి 
అందించిన నీలకంఠ హరుడు!
వరుని రాక కోసం తపస్సు చేసిన మునులు!
నీటి వనరులే మనకు
 ఆధార గనులు!
జలజల పరుగు లిడే 
 గోదావరి కృష్ణమ్మ పరుగులు!

కాకతీయ చెరువులు తలపించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు!
జలధార పంటలకు
 కొంగ్రొత్త ఆశలు!
నేలను సస్యశ్యామలం 
చేసిన విరులు!

ప్రకృతి ప్రసాదించిన 
పంచేంద్రియాల పడులు!
జన సిరులను ఒడిసిపట్టి 
జన జాగృతం చేద్దామా!

భూమి లోకి నిక్షిప్తం చేసే
 తరగని స్వర్ణ నిధులు!
సమస్త జీవకోటి
 ప్రాణాధారమైన జలా మృతాలు!

సృష్టికి మూలాధారం అయిన జీవనదులు!
సజీవంగా పయనించే 
కిన్నర హోయలు!
సుజలాం ......సుఫలాం .....మలయజ శీతలామ్ ....సస్యశ్యామలాం....!

కామెంట్‌లు