నది:- సత్యవాణి

 నదిదీ మదిదీ ఒకే పోలిక
చిన్న చిన్న అలలకు
చెదరదు నది గంభీరత
మదీ అంతే
ఆటుపోటల్లా వచ్చి పోయే
చిన్న చిన్న కష్టాలకు చెదిరి బెదరిపోదు మది
జీవనదిలో తడి ఇంకనట్టే
మదిలో జాలి దయ ప్రేమానురాగాలు ఇంకిపోవు
సెల ఏరులు తనను చేరితే 
కలకలలాడుతూ గలగలా ప్రవహిస్తుంది నది నిండుగా
ప్రేమాప్యాయతలు మదిని తాకితే
పరవశంతో పాటలు పాడుతుందిమది
పరవశిస్తుంది మది
పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తుందది
వరద వచ్చి నదిని కలసిందా
ఉప్పెనై ముంచెత్తుతుంది
బీళ్ళను ఊళ్ళనూ ఏకం చేస్తుంది నది
మదికి గాయమైతే
కన్నులను నీటితో ముంచేస్తుంది మది
          
కామెంట్‌లు