శివ పార్వతులు :(ప్రక్రియ: జానపద గేయం )--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
సక్కాని వాడివయ్యా శివయ్యా 
నీకు పక్కాన గౌరమ్మ సగమయ్య 

చుక్కాని మాపడవకు మీరయ్య 
బాగ లెక్కాగ దరిమాకు సూపయ్య

పక్కాగా పాలకడలి సిలకేరయ్య 
అంత చిక్కాగ పామ్ ఇషం గక్కేనయ్య

దిక్కేది లోకాల కాచేనయ్యా 
మాకు తిక్కాగ ఉందంట మొక్కేరయ్య 

సక్కాని పార్వతమ్మ సెప్పేనయ్యా 
నీకు, గుక్కాలు పట్టి ఇషం తాగేవయ్యా 

నిప్పల్లే గొంతులో కాలిందయ్యా 
పైన బొగ్గోలే గొంతుకాడ కవిలిందయ్యా 

లెక్కాగ లోకాన్ని కాచేరయ్యా 
సూడ సక్కాని జంటల్లే నిల్చే
 రయ్య 

సిక్కాని పుట్టతేనె లిచ్చేమయ్యా సామి 
ముక్కాల తొడుగుముప్పు దీసెయ్ వయ్యా!


కామెంట్‌లు