నిద్ర ఒక దేవత
నిద్ర ఒక సుఖం
నిద్ర ఒక భాగ్యం
నిద్ర ఒక భోగం
నిద్ర ప ట్టిన వాడు అదృష్టవంతుడు
నిల్ఛుని నిద్రపోగలడు
అదృష్ట హీనుడు
హంసతూలికా తల్పంపై
పవ్వళించినా పట్టు పరుపుపై
పవ్వళించినా
కంటిపైనవాలదు నిద్ర
అదేమిటో
మనసుకు గాయమైనా
కంటకి రాదు నిద్ర
మనసు ఉల్లాసంతో తేలిపోయినా
కంటికి చేరువవదు నిద్ర
కూడులేనివాడిని
కోటీశ్వరుడైనట్లు కారుల్లో మేడల్లో తిరుగుతున్నట్లు కలలుతెప్పించిన నిద్ర
ఆతడిని పొంగిపోయేట్లు చేయగలదు
ఆనిద్రే భాగ్యవంతుని కలలో బికారిని చేసి భయపడేట్లు చేస్తుంది
గజగజలాడేటట్లు చేస్తుంది
భయంతో పిచ్ఛివాడైయ్యేట్లు చేస్తుంది
కాటికాపరి అయినా కైలాసగిరి ప్రదేశంలో నిశ్చింతగా నిద్రపొయేలా చేయగలిగిన నిద్ర
విలసవంతమైన పటిష్టమైన భవనంలో పదిమందిమద్య పడుకొన్నవాడు కూడా
భూత ప్రేతాల భయంతో
కంటినిండా నిద్రించకుండా చేయగలదు
నిద్ర పట్టడం ఒక వరం
అదుకనే అంటారు కంటినిండానిద్రించేవాడు భోగి
నిద్రించనివాడు ఒకరోగి అని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి