ఏరువాక పున్నమి....అచ్యుతుని రాజ్యశ్రీ

 మనదేశం పశుపోషణ రైతుల కు ఇచ్చే గౌరవం ఆదరణ ఏనాటినుంచో వస్తున్నది.చిన్ని కృష్ణుడు ఆవులమేపుతూ గోవర్ధనపర్వతం ఎత్తాడు.పిల్లలకి పాలు పెరుగు వెన్న పంచటంలో ఆంతర్యం ఏమంటే  బాల్యం నుంచి పిల్లలకి అవి తినిపించితే మానసిక శారీరక ఆరోగ్యం తో ఎదిగి మంచి దృఢకాయులై దేశరక్షణ కావిస్తారు అని.మనంతిని నలుగురికీ పంచాలి అనే సోషలిజం!శ్రీ లాల్బహద్దూర్ శాస్త్రీజీ జైజవాన్ జైకిసాన్ అన్నారు. జ్యేష్ఠ పూర్ణిమ నే ఏరువాక పున్నమి అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధం గా ఉంచిన నాగలి అని అర్థం. ఏరువాక అంటే దుక్కి యొక్క ప్రారంభం. ప్రాచీన కాలంలో దీన్ని ఉద్ వృషభయజ్ఞం అనేవారు.ఎద్దులను అలంకరించి పూజచేసికొమ్ములకు రంగులు వేసి పులగం వండి ఇంద్రుడుకి నైవేద్యంపెడతారు.ఎద్దులకు తినిపించుతారు. మేళతాళాలతో ఊరేగించి ఆపై భూమి ని  దున్నుతారు.కన్నడవాసులు కారణి పబ్బం అని చేస్తారు. తొలకరివానలు ఆనందం ఇస్తాయి.వప్పమంగలదివసం గా రైతులు ఈపండగ జరిపేవారు అని జాతక కథల వల్ల తెలుస్తోంది. జీతగాళ్ళకి కొత్త ఏడాది ఆరంభం!ఎద్దులకు పరుగుపందెంలు బండరాయిని కట్టి లాగించే పోటీలు జరుపుతారు. ఆవుని గోమాతగా పూజిస్తాం. ఆమెకొడుకులు ఎద్దులను సోదరులుగా భావించి ప్రేమ ఆప్యాయత  తో  చూస్తూ  పని చేయించుకోవాలి అనే గొప్ప భావం  ఇందులో ఉంది. అవి చనిపోయినా వాటి కొమ్ములతో దువ్వెనలు బొమ్మలు చేస్తారు. వాటి తోలుతో  చెప్పులు తోలు వస్తువులు  చేయటం కుటీర పరిశ్రమ. అవి ముసలివై 
తిండి దండగ అని కబేళాకి తోలటం మహాపాపం! వాటి పేడతో ఎరువులు  గోబర్ గాస్ చేస్తున్నారు. మన ముసలి అమ్మమ్మ బామ్మ  తాత లు ఏపనీ చేయరని సతాయించరాదు.వారిని గౌరవించాలి. అలాగే పశుపోషణ చేయాలి అని చెప్పే 
పండుగ ఏరువాక పున్నమి.
కామెంట్‌లు