నీటి బిందువు:-*కంది.సత్యనారాయణ మూర్తి* M. Sc, B. Ed, F. I. I. Iవిజయనగరం9030277529
నిను జూచి
చిన్ని మొలకకి ప్రాణం లేచొచ్చే..

నేలను ముద్దాడి
ధరణి అందెలకు మువ్వలగా మారే...


అలిసిన ప్రాణికి
ఊపిరి పోసి ఊరటనిచ్చే..

నుదిటిని తాకి 
అరుణ తిలకమై ఆశలు రేపే..

జలము లేని
జీవం లేదని మా దోసిట నిండే..

సమస్త మానవాళికి
ఆత్మ బంధువై ఆధారమై నిలిచే ...


కామెంట్‌లు