బుద్ధివలం గొప్ప :-యడ్ల శ్రీనివాసరావుMSw,MTel-విజయనగరం జిల్లాచరవాణి:9493707592

 రామాపురం అనే ఒకానొక ఊరిలో సోమరాజు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతడు ప్రజలకు సేవ చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. మా ఊర్లో ఒక చెరువు కలదు. అచట కి అందరూ వెళ్లి  మూత్రవిసర్జన, వ్యర్థపదార్థాలు పోయడం చేస్తూ ఉండేవారు. దీంతో అక్కడ దోమలు ఈగలు ఎక్కువగా చేరడం మొదలయింది.
                      అనుకోకుండా అక్కడ ఆ చెరువు లో మలేరియా దోమలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. చాలా మందికి రాత్రి లోపాలు కంటి మీద కునుకు  కూడా లేకుండా పోయింది. మలేరియా జబ్బుతో అందరూ బాధపడుతూ ఉన్నారు.
                   అనుకోకుండా ఆ సంఘ సేవకుడు మలేరియా ఆసుపత్రికి ఒక లెటర్ వేసి ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో రాత్రి పూట మలేరియా డిపార్ట్మెంట్ వారు వచ్చి రక్త పరీక్షలు చేసి మందులు ఇవ్వడం కొనసాగింది. అయితే ఆ కుర్రవాడు నేర్పుతూ మలేరియా డిపార్ట్మెంట్ లో చేయి కలిపి చేపలు తీసుకొని వచ్చి ఆ చెరువులో వదలడం సాగింది. దీంతో ఆ చెరువు అంతా నిండి ఉన్న చేపలు ఆ దోమల ఆహారంగా తినడం సాగింది. బుద్ధి బలం ఉంటే ఏదైనా సాధించగలం. కాబట్టి ఆరోజు నుండి మల మూత్ర విసర్జన కొరకు అతడు మున్సిపల్ కమిషనర్ గారికి మరుగుదొడ్లు శాంక్షన్ చేయమని వేడుకున్నాడు.
                    దాంతో ఆ కుర్రవాడు చెప్పిన నా మాట విని మున్సిపల్ కమిషనర్ సంతోషంతో ఆ ఊరంతా సందడి చేసుకోవడం చూసి ఆనందించారు.
                      నీతి ఈ కథలో ఏమనగా కృషి ఉంటే ఏదైనా సాధించగలం. కండ బలం కన్నా బుద్ధి బలం గొప్పది అని తెలుసుకోవచ్చు.
కామెంట్‌లు