"కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణ గారికిపద్యాంజలి"!!!: -"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
తే.గీ.
"భారతీయసంస్కృతిచాటిభాసురముగ"
"వేయిపడగలువిరచించివిశ్వనాథ"
"సత్యనారాయణాఖ్యుండుసముచితముగ"
"సంప్రదాయాలవివరించెసత్కవిగను"!!!

02.
తే.గీ.
"తెలుగులోజ్ఞానపీఠమ్ముతొలిగనొంది"
"వెలుగులీనెనుకీర్తితోవిశ్వమందు"
"ప్రక్రియలనెన్నొచేపట్టిఫలితమొంది"
"తెలుగుభాషామతల్లికితిలకమయ్యె"!!!

03.
తే.గీ.
"సాహితీలోకసామ్రాజ్యచక్రవర్తి"
"పద్మభూషణబిరుదారిపరమయోగి"
"భారతీమాతకన్నట్టిభాగ్యఫలము"
"విశ్వనాథునినుతియింతువేనవేల"!!!

04.
కం.
"మలినన్నయభట్టుయతడు"
"విలసితకావ్యాలనెన్నొవిరచించియుతా"
"తెలుగుకుశోభలనెన్నియు"
కలిగించిన"విశ్వనాథకవిసామ్రాట్టే"!!!


కామెంట్‌లు