311.
సూర్యకోటి తేజము
తొలగును అజ్ఞానము
ఘనమైన ద్యేయము
గురువుల గొప్పతనము
312.
కొవ్వొత్తిలా కరుగును
అహర్నిశలు ఆరాటము
శిష్యుని భవితవ్యము
చూసి పడును సంబరము
313.
మచ్చలేని సుగుణము
వాడని తేజోమయము
ఓర్పు సహనముల రూపము
గురువులు స్ఫూర్తిదాయకము
314.
అజ్ఞానం పోగొట్టును
వెలుగు రేఖలు నింపును
జీవితాలు దిద్దును
సంతోషం నింపును
315.
నాయకుడై ముందుండును
నీతి నిజాయితీలను
నిక్కచితత్వమును
గురువు ఆచరించును
316.
విజ్ఞాన కల్పతరువు
సమాజ స్ఫూర్తిదాతవు
జ్ఞాన జ్యోతీ గురువు
మార్గదర్శనమైనావు
317.
పసిపాపల మనమున
కుసుమాలు విరబూసిన
భరోస నిండె భవితమున
సాధ్యమే గురువుల వలన
318.
మూఢనమ్మకాలను
తొలగించి వేయును
సమాజ చైతన్యమును
జ్ఞానముతో నింపును
319.
సమస్త వృత్తులందు
బాధ్యత ఎంతో కలదు
దేశభవిత గురువులందు
మార్గదర్శనం పొందు
320.
శిలలను శిల్పాలుగా
చెక్కునట్టి గురువులుగా
సమాజంలో కీర్తిగా
గౌరవం పొందేరుగా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి