భావి భారత మొలక(బాలగేయం):-చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464

ఆత్మవిశ్వాసం కలిగి
అనుక్షణం మీ లక్ష్యాన్నే *తలవండి*

మీకు జన్మనిచ్చిన
తల్లిదండ్రులను *కొలవoడి*

దారి చూపిన గురువులను
గౌరవంతో *పిలవండి*

స్ఫూర్తి నింపే మాటల కోసం
వినయంతో *కలవండి*

కష్ట సుఖాలలో తోడుంటూ
సాటి వారికి *పలకండి*

మంచి దారిలో పయనిస్తూ
మీలోని చెడును *పిలకండి*

ప్రగతి పథంలో వెళ్ళేటి
మీరే భావితరం *మొలకండి*

సృజనకు పదును పెట్టి
మేధస్సును *చిలకండి*


కామెంట్‌లు