ఓ మానవుడా !
ఆకాశాన్ని నీ కనురెప్పల
మాటున దాచుకుంటావా !
సముద్రాన్ని నీ అరచేతితో
పట్టుకుంటావా ?
గాలిని పిడికిట పెట్టుకుంటావా
ఇసుకలో రాయవచ్చును, కానీ
నీటిపై వ్రాతలు రాయగలరా ?
సృష్టికి ప్రతి సృష్టి చేసినా
మనిషికి ప్రాణం పోయే గలవా ?
నీవు సాధించలేనిది
నీ శక్తియుక్తులతో
నీటిని సృష్టించలేవు
గాలిని బంధించ లేవు
ఇవన్నీ భగవంతునికి సాధ్యం
ఈ సృష్టి నాటకములో నీవు
పాత్రధారివే !
నిన్ను నడిపించే సూత్రధారి
భగవంతుడే !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి