భాద్రపద మాసమున భవ్యమగు రూపమున
అదితి కశ్యపులకును ఆ వామనుడు బుట్టె
విజయ ద్వాదశి గాను వివరింతు రీచరిత
సూక్ష్మము గానుండి సూదంటు రాయివలె
ఆత్మ యాకర్షించు అతి స్థూలదేహాలు
ఇట్టి సూత్రము తోడ ఇలలోన జరిగింది
బలి యింద్ర పదవిని బలిమితో నుండగా
దానవులు చెలరేగి కానలకు తరుమగా
దేవతల మొరలువిని దేవదేవుడు హరియు
వామనుని గాపుట్టి వానిపీచము యణచ
దానముకు వెడలియును తానడిగె భూమినిట
మూడడుగులే చాలు ముచ్చటగ పలికాడు
పరిహాస వదనమున ఫక్కున నవ్వ బలియు
కుల గురువు శుక్రుడును కూర్మితో వారించ
వినిపించు కోకనే విప్ర దానము నొసగె
ఒకయడుగుకు భూమిని చకచకా నింగినిక
మూడోది యెక్కడని మూర్ఖబలి నడిగాడు
మాటతప్పని రాజు మరియడుగు నెత్తినని
పాతాళమునకేగి పరమ పూజితుడయ్యె
పరులసొమ్ములు దినియు పరపీడనము జేయు
గర్వించు వారికిది గణనీయ దండనము
బిందువుగ తానున్న బీజమ్ము వలెనెదిగి
మహా వృక్షము వలెను మానవుడు యెదగాలి !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి