న్యస్తాక్షరి:-మమత ఐల-హైదరాబాద్9247593432

 1- నాల్గవ అక్షరం మా
2-ఆరవ అక్షరం వీ
3-ఎనిమిదవ అక్షరం క
4-పదకొఃడవ అక్షరం జ
వచ్చేలాగా ఉత్పలమాల లో పద్యం
ఉ.
అక్షర మాలలల్లి కవనంబును చక్కగ కూర్పు చేయగా
తక్షణమందు వీణులకు ధన్యత కూర్చెడి భావమబ్బునే
పక్షము విద్యకైనకల భాగ్యముచేకొను జీవితంబునన్ 
పక్షిగ రెక్కలిప్పి మరి పంజర మీడుచు సాగిపోదువే
అంశం:-
నిషిద్ధాక్షరి:- 
క ,న అక్షర గుణితాలు నిషేధిస్తూ నచ్చిన అంశంపై పద్యాలు
కం
చరచర పారుచు పాములు
బురదల వడివడిగ తిరిగి బుసలిడు తుండా
బిరబిర పరుగులు పెట్టుచు
తరలిరి చిరు పెద్దలంత దారులు 
మరచీ!
కం
గిరగిర గుండ్రటి చుట్టల
మురుగులు వేయించిపెట్ట ముదముగ పిల్లల్
శరవేగపు పరుగులతో
సరసర బుజియించ వచ్చి జారిపడుదురే!

కామెంట్‌లు