ఈ కరోనా కాలంలో అందరూ గుడ్లు తింటున్నారు.డాక్టర్లు కూడా ప్రతి ఒక్కరికీ గుడ్డు తినమని చెప్పడం చూస్తున్నాము.
మరి గుడ్లను గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో గుడ్లు లభిస్తున్నాయి.గుడ్లను రకరకాలుగా,రుచిగా వండటం చాలా సులభం.
గుడ్డులో అనేక ప్రోటీన్లు,శరీరానికి మేలుచేసే అమినో ఆసిడ్లు,ఇనుము,భాస్వరం,మెగ్నీషియంలతో పాటు సుమారు 13 రకాల మినరల్స్ ఇందులో లభిస్తాయి.ఒక్క విటమిన్ 'సి' మాత్రం లభించదు! (కుర్ట్ హాంగ్ MD.పరిశోధన).
అందుకే ఎదిగే పిల్లలకు, అనారోగ్యం నుండి కోలుకున్న వారికి ముఖ్యంగా క్షయ రోగులకు గుడ్డు తినమని డాక్టర్లు చెబుతుంటారు.గుడ్డులో సుమారు 300 మైక్రోగ్రాముల కోలిన్ ఉంటుది ఇది మెదడు కణాలను కాపాడుతుంది.
1982లో గుడ్ల అమ్మకం,ధర క్రమ బద్ధీకరించడానికి 'నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ని (NECC) ని గుడ్ల ఉత్పత్తి దారులు స్థాపించారు. ఈ కమిటీ గుడ్ల ధరను నిర్ణయించి, గుడ్ల ఉత్పత్తి దారులకు లాభంచేకూర్చడమే కాకుండా,గుడ్ల వలన ఆరోగ్య లాభాలను గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నది.నిజానికి నాటు కోడి గుడ్డుకి, ఫారం కోడిగుడ్డికి పోషకవిలువల్లో బేధం లేదు.
గుడ్డుతో చక్కెర,చక్కెర పదార్థాలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.పూనె లోని వెంకటేశ్వర హాచరీస్ పరిశోధనా సంస్థవారు మరింత రోగ నిరోధక శక్తి గల కోళ్ళు,వాటి గుడ్ల మీద పరిశోధనలు చేస్తున్నారు.
గుడ్డు చెడిపోయిందా లేదా అని పరీక్షించడానికి గుడ్డును నీటిలో ముంచితే మునుగుతుంది, చెడిపోయినదయితే తేలుతుంది!పగిలిన గుడ్లు అసలు కొనకూడదు,వాటిలో హానీ చేసే బాక్టీరియా ఉండవచ్చు.గుడ్లను ఫ్రిజ్ లో ఉంచవచ్చు కానీ వెడల్పు భాగాన్ని పైకి ఉంచుతే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.గుండె జబ్బులున్నవారు గుడ్డులోని పచ్చ సొన తినకూడదని కొందరు డాక్టర్లు చెబుతున్నారు కానీ ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో రోజుకొక గుడ్డుతిన్నా గుండెకు ప్రమాదం లేదని డా॥మషీద్ 2020 పరిశోధనలు చెబుతున్నాయి.మేలు చేసే కొలెస్టరాల్(HDL) కూడా పెరుగుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.
గుడ్డులో కంటికి మేలు చేసే జియాక్సాంతిన్,ల్యుటిన్ అనే పదార్థాలు ఉన్నాయి.
పొద్దున అల్పాహారంగా గుడ్డు బ్రెడ్తోకాని వీరే పదార్థం తో కానీ తీసుకుంటే భోజన సమయం వరకు ఆకలి వెయ్యదు.చేపలు గుడ్డు కలిపి తినకూడదని 'న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్' లో వివరించబడింది.
ప్రతి సంవత్సరం అక్టోబరు రెండవ శుక్రవారం గుడ్డు దినంగా పాటిస్తున్నారు.
ఇవండీ గుడ్డు సంగతులు.
****************
మీకు తెలుసా?
మొట్టమొదటి సోలార్ పవర్ స్టేషన్ ఈజిప్ట్ లో 1897 లో నిర్మించారు.దీని సామర్థ్యం 45-52 కిలో వాట్లు.
****************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి