పద్యాలు : -*బెజుగాం శ్రీజ**గుర్రాలగొంది జిల్లా: సిద్దిపేట**చరవాణి:9391097371*

 *సీసమాలిక*
చుట్టుపక్కలనుండి చుట్టము లాగను
చూడరాగను పాము చోద్యమాయె
యింట్లోకివచ్చియె యిళ్ళంతదిరిగియు
భయపెట్టెమమ్ముల పౌరుషముగ
పాముపట్టుటకును పదిమందివచ్చిన
నాటలాడించెనే యందరికిని
గోడలవెంబడి కోరలు దీయుచు
రేకుల్లజొచ్చెను పాకుకుంటు
వెదకుచునుండగ వేగంగపైనుండి
క్రిందకుదూకెను రందితోడ
చివరికిదొరకగ చేతుల్ల కఱ్ఱతో
చంపిరినందరు శ్రమనుబడియు
*తేటగీతి*
ఇంటిచుట్టురా గరికను నిష్టపడియు
శుభ్ర పరచాలినెప్పుడు  సుందరముగ
జాగృతముతోడనుండగ జనులెయంత
ఫణులు రావుగ నింట్లోకి పరగనెపుడు

కామెంట్‌లు