వేసవికాలం వచ్చింది
ఎండావేడిని తెచ్చింది
మండేనేలను ఇచ్చింది
చెమటాచుక్కల ఇచ్చింది
కావాలండీ కావాలి
చల్లని నీరూ కావాలి
ఖద్దరు బట్టలు కావాలి
కాళ్లకు చెప్పులు కావాలి
తలకూ గొడుగూ కావాలి
వచ్చిందండీ వచ్చింది
వానాకాలం వచ్చింది
మెండుగవానలు తెచ్చింది
జగతికినీటిని ఇచ్చింది
వాగులువంకలు తెచ్చింది
కావాలండీ కావాలి
ఆరినదుస్తులు కావాలి
తలకూగొడుగూ కావాలి
వేడిగవంటలు కావాలి
వెచ్చనికాఫీ కావాలి
వచ్చిందండీ వచ్చింది
వేసవికాలం వచ్చింది
మంచుబిందువులు తెచ్చింది
పొగలమంచుతో నింపింది
వణుకులఒళ్లూ ఇచ్చింది
కావాలండీ కావాలి
చలికీమంటలు కావాలి
ఉన్నీదుస్తులు కావాలి
వెచ్చనిదుప్పటి కావాలి
వెచ్చనినీరూ కావాలి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి