మా విశ్వ విజయశాంతి. (కవిత):-గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.

శాంతి శాంతి ఓం శాంతి
క్రాంతి క్రాంతి మావి క్రాంతి
మా విశ్వ జనుల సంక్రాంతి
గైకొన్నావా ఇక విశ్రాంతి ,,,,,!

శాంతి శాంతి ప్రజల ప్రశాంతి
పల్లెల ముల్లెల సజల స్రవంతి
మా జనజీవన వివేక వేదాంతి
భద్రత ఇచ్చిన మా విశ్వభవంతి !

ఎక్కడికెళ్ళావు ఓ తల్లి
కనబడకుండా నీవు మళ్ళి
మొదలాయెనుగా ఇక లొల్లి
పాకిపోయేను అవి గల్లి గల్లి !

ఇక్కడ అక్కడ అనుకోకుండ
ఎవరేమి చెప్పినా వినకుండ
ఇల సృష్టిస్తున్నారు గొడవలు
అల్లరి చేస్తున్నారు బడవలు !

గొడవల కుంపట్లో ఆజ్యం
పోస్తూ చేస్తున్నరు రాజ్యం
కుప్పకూలిపోయె వాణిజ్యం
కష్ట నష్టాల్లో పడే సామ్రాజ్యం !

అఘాయిత్యాలు విజృంభించే
అవినీతి అంగడిని ప్రారంభించే
న్యాయం ధర్మం ఇల అంతరించే
అన్యాయం పైచేయిగ అవతరించే

ఆ అఘాయిత్యాల అణచివేయ
నీవమ్మా
ఈ అరాచకాల రూపుమాప ఇక 
రావమ్మా
అమ్మా తల్లీ విశ్వ విజయశాంతి
జేజమ్మై నెలకొల్పాలిక ఇలలో శాంతి !

కామెంట్‌లు