831) ఇద్దరు అన్నదమ్ములే
వారు తోడు దొంగలే
పైగా వారు లంగలే
మారస్తారు రంగులే !
832) అది కోటిలింగాల
కోనేటిలో మునగాల
ములకలే వేయాల
గుంజీలు తీయాల !
833) రాముని కళ్యాణమండి
చూద్దాము రారండి
కట్టండి మీరు బండి
తొందరగా ఎక్కండి !
834) అది సీతమ్మ తల్లి గుడి
అంతా పోదాం రండి
ముందుంది పెద్ద గండి
జాగ్రత్త మీరండి !
835)ముత్యమంత ముద్దే ముద్దు
ఇస్తే వద్దని అనవద్దు
వచ్చిందిగా నీ పద్దు
పెట్టుకో ఇక ముద్దు !
836) లిప్స్టిక్ పూసిన పెదవులు
తాగు తున్నవి మధువులు
చూస్తున్నరు వెధవలు
మారిపోయే విలువలు !
837) కిర్రు కిర్రు చెప్పులు
కొట్టు నీవు డప్పులు
వేసేయ్ స్టెప్పులు
కొట్టేయరా కప్పులు!
838) ఏమిటి రా ఈ తప్పులు
వస్తాయి రా ముప్పులు
చేయకురా అప్పులు
ఎవరికై ఈ తిప్పలు !
839) రావమ్మ వాసంతి
ఎవరమ్మా ఈ ఇంతి
మన పక్కింటి శాంతి
చేసుకుంది వాంతి !
840) అది సాయి మందిరం
పోదామా అందరం
చెప్పరా సుందరం
కదలండి ఇక వేగిరం !
841) చూరులో ఉంది ఎలుక
చూస్తున్నదిలే చిలుకు
అది పోయింది మూలకు
చిలక వేళ్ళె చేలకు !
842) గూడుపుఠాణి చేయకు
తప్పుడు రాత రాయకు
అగ్గిలో ఉప్పు వేయకు
బురదలో రాయి తీయకు !
843)ఏమిటి ఈ పరవశం
మునగకు పరాంకుశం
ఏది నీ ఆవేశం
ఇదా నీ అంకుశం !
844) చేయకు దాసోహం
చేసుకో వివాహం
వద్దురా ఆగ్రహం
పాటించు నిగ్రహం !
845) నీవు నాకు నచ్చలే
నచ్చితే నే వస్తాలే
మెడలో మాల వేస్తాలే
నీవిక చూస్తావులే !
846) గందరగోళం చేయకు
నా గళాన్ని మూయకు
తారు ఇంకా పూయకు
జోరు నీవు ఇక చేయకు !
847) గళ్ళలో డబ్బులు వేయి
జేబులోన చెయ్యి వేయి
దానం నీవు చేయి
నిదాన మై ఉండవోయి !
848) సీసా పగలగొట్టకు
బిరుడ నీవు పెట్టకు
ఎవరినిగూడ తిట్టకు
నామం నీవు పెట్టకు!
849)ఓ రాఘవేంద్ర
ఓ మా రామచంద్ర
నీవేనా సురేంద్ర
రారా అమరేంద్ర !
850) నీ రాశి సింహరాశి
నా రాశి మేష రాశి
పోదామా మనం కాశి
వస్తాడట మన వంశి !
851) అక్కది వృశ్చిక రాశి
బావది వృషభ రాశి
మావది మీనరాశి
మరి అత్తది ఏ రాశి?
852)పల్లె మామ వచ్చిండు
పల్లీలు మాకు తెచ్చిండు
జొన్న కంకులు ఇచ్చిండు
తినమని మాకు చెప్పిండు!
853) నాకుంది ప్రజాబలం
నీకుందా అంగబలం
వానిదిమో ధన బలం
లేదు ఎవరికి కుల బలం !
854) చూసుకో దినఫలం
రాసుకో వారఫలం
ఇదేమో మాసఫలం
మరేది కర్మ ఫలం !
855) దినఫలం బాగుంది
వార ఫలం చెడింది
మాసఫలం మూడింది
మా కర్మ కాలింది !
856) జమ చేశావా చిల్లరా
నేనైతే వల్ల రా
జర చూడు నల్లరా
కుట్టుకరా కుల్ల రా !
856) దోమలగూడ పోయిన
వచ్చినాను నాయన
ఛాయ నీకు పోయన
నీ బొమ్మ నే గీయన !
857) ఉన్నవి అరటి పండ్లు
తెస్తున్నానుర చెండ్లు
కడుతున్నారు బండ్లు
పూస్తున్నారు ఇండ్లు !
858) లెక్కలు చేస్తున్నారు
చుక్కలు చూస్తున్నారు
పాపం పస్తున్నారు
చేయలేక చస్తున్నారు !
859) పుస్తకాలు రాసిండు
బస్కీలను తీసిండు
జమాబందీ చేసిండు
బలాదూర్ అన్నాడు !
860) ఇది ఎర్ర కుంకుమా
పసుపు పంపుమా
నీవు నీరు వంపుమా
మల్లెపూలు తెంపుమా !
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి