*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౯౫ - 95)

 మత్తేభము:
*మొదలన్ భక్తులకిచతచినాడవుగదా | మోక్షంబు నేడేమయా*
*ముదియంగా ముదియంగబుట్టు ఘనమౌ | మోహంబు లోభంబు న*
*న్నది సత్యంబు, కృపందలంపవొక పు | ణ్యాత్ముండు నిన్నాత్మన్గొ*
*ల్చిదినంబు న్మొరపెట్టగా కటకటా | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
ఇంతకుముందు నువ్వు అడిగిన వారికి, అడగని వారికి కూడా మోక్షము ఇచ్చావు కదా!  ఇప్పుడు నీకేమైనా ముసలితనం వచ్చిందా. ఎందుకంటే, ముసలితనంలో మతిమరుపు, ఓపిక తగ్గడం జరుగుతుంది కదా! నిన్ను ఒక భక్తుడు ఎంతో భక్తితో పూజించి అడుగుతంటే మోక్షము ఇవ్వడానికి వెనుకముందు అవుతున్నావు......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నిన్ను కోరిన మార్కండేయునికి, అడగని త్రిపురాసురలకు, నిన్నే నమ్మిన ప్రహ్లాదునికి, అందరికీ మోక్షమొసగావు, ముముక్షువులను చేసావు, కారుణ్య నిథీ!  మరి ఇప్పడేమో నేను గొంతెత్తి ప్రార్థిస్తూ వున్నా, కరుణించకున్నావు, కరుణాకరా! నిన్నె నమ్మి వున్నాను కదా, ఇంత చిన్నచూపు ఏల స్వామీ! నీవు కాక మమ్మల్ని వేరెవ్వరు కాపాడుతారు.  నీకు వార్ధక్యం లేదు, ఇది నా నిశ్చిత అభిప్రాయము. నీ భక్తుల మీద నీకు వున్నది వాత్సల్యమే.  నన్ను ఉద్ధరించు నా ప్రాణ సఖా! నీదే భారం.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు