సీ. ఈభూమి,ఈనీరు:ఈయగ్నివాయువున్
ఆకాశమున్ లెని:ఆదియందు
శూన్యమైయుండ నా:శూన్యంబునందుండి
తనుతాను సృష్టించు:కొనినయంత
మను,మయ,త్వష్టలు:మరియుశిల్పిన్ తుదన్
సృష్టించె దైవజ్ఞు:సృష్టిచేయ
పంచ ఋషులసృష్టి:ప్రకృతియైవ్యాపించె
విశ్వకర్మమహిమ:విశ్వమెల్ల
తేగీ.పుట్టినది మొదలు నరుడు:గిట్టు వరకు
వలయు వస్తువులన్నియు:మలిచి యిచ్చె
అద్భుత నగరాలు మరియు:ఆయుధాలు
అన్యులెవ్వరు చేయలేని:యద్భుతాలు
విశ్వకర్మయెచేసెయీ:వింతసృష్టి
సుదర్శన చక్రం చరిత్ర
************
సీ. విశ్వకర్మ భగవాన్:విశ్వము పోషింప
విష్ణుమూర్తికి పని:పిలిచిపంచె
దుష్టల శిక్షింప:తోచు నుపాయము
ఆయుధ మిమ్మని:హరియడిగెను
అల్లుడు సూర్యుని:ఆవేడి సెగలను
తాళలేననిచెప్పె:తనయ సంజ్ఞ
తాపమునించుక:తగ్గించ సూర్యుని
సంజ్ఞకోరికమేర:సానబట్టె
తేగీ. రవిని సానబట్టునపుడు:రాలె రజను
రజను మిళితముచేసి చ:క్రమును చేసి
విష్ణుమూర్తికి ఇచ్చెను:విశ్వకర్మ
అది సుదర్శనచక్రమై:అలరు చుండె
మూడు యుగముల దుష్టుల:పీడ నణచె.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి